శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (11:54 IST)

హిందీ బిగ్ బాస్.. శ్రీశాంత్ సురభిని అంత మాట అనేశాడు.. గోడకేసి బాదుకున్నాడు..

టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ వార్తల్లో నిలిచాడు. హిందీ బిగ్ బాస్ సీజన్ 12 వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 12లో శ్రీశాంత్ కంటెస్టెంట్‌గా వున్నాడు. ఈ హౌస్‌లోకి కంటిస్టెంట్‌గా వెళ్లిన శ్రీశాంత్ మొదటి నుంచి తన ప్రవర్తనతో ఏదొక గొడవలకు కారణమవుతూనే వున్నాడు. ఇటీవల శ్రీశాంత్ హౌస్‌మేట్ సురభి రానాతో గొడవకు దిగాడు. 
 
ఇద్దరూ ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకున్నారు. శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సర్ అని, చీటర్ అని అంటే.. ఆవేశానికి గురైన శ్రీశాంత్ సురభిని వ్యభిచారి అంటూ కామెంట్స్ చేశాడు. కానీ తొందరపడి అన్న మాటలకు పశ్చాత్తాపంతో సురభికి క్షమాపణలు చెప్పాడు. ఆ బాధతో కుంగిపోయిన శ్రీశాంత్ బాత్రూమ్‌లోకి వెళ్లి గడియపెట్టుకుని తన తలను గోడకేసి బాదుకున్నాడు. 
 
గాయపడిన శ్రీశాంత్‌ని బిగ్ బాస్ నిర్వాహకులు ఆస్పత్రికి తరలించారు. ట్రీట్మెంట్ పూర్తయ్యాక శ్రీశాంత్ బిగ్ బాస్ హౌస్‌లోకి చేరుకున్నాడు. తన భర్త గాయం నుంచి కోలుకున్నాడని శ్రీశాంత్ భార్య సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.