గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (15:21 IST)

పెళ్లి దుస్తులపై కోటు ధరించి ప్రాక్టికల్స్‌కు హాజరైన వధువు

kerala bride
కేరళ రాష్ట్రంలో ఓ వధువు పెళ్లి దుస్తులతోనే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరైంది. తమ సహచరిణిని పెళ్లి దుస్తుల్లో చూడగానే మిగిలిన విద్యార్థులు ఆనందంతో స్వాగతం పలికారు. ఈ వధువుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీలక్ష్మి అనిల్ అనే యువతి బెథానీ నవజీవన్ ఫిజియోథెరఫీ కాలేజీలో వైద్య కోర్సును అభ్యసిస్తుంది. అయితే, ఈమెకు ఓ యువకుడితో పెళ్లి కుదిరింది. కానీ, వీరి ముహూర్తం రోజే ఫిజియోథెరఫీ ప్రాక్టికల్ పరీక్ష కూడా ఉండటంతో ఆ వధువు మెడలో తాళిబొట్టు పడగానే పెళ్లి మండపం నుంచి నేరుగా పరీక్షా హాలుకు వెళ్లింది. 
 
పసుపు రంగు చీర, బంగారు ఆభరణాలతో పాటు ఆప్రాన్ ధరించి మెడకు స్టెతస్కోప్ వేసుకుని ఈ కొత్త పెళ్లి కుమార్తె ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌కు హాజరైంది. ఆమెను చూసిన క్లాస్‌మేట్స్ ఆనందంతో పరీక్షా హాలులోకి స్వాగతం పలికారు. మెడికోస్ లైఫ్.. ఒకే రోజున పరీక్ష - పెళ్లి అంటూ క్యాప్షన్ జోడించిన ఓ వీడియోను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తూ వీడియోను షేర్ చేస్తున్నారు.