శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 12 ఏప్రియల్ 2018 (08:51 IST)

సభ ఆర్డర్‌లో లేదన్న సంగతి గుర్తుకురాలేదా? : మోడీ దీక్షపై చంద్రబాబు కౌంటర్

కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు అడ్డుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీయేనని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు అడ్డుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీయేనని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 
 
గడచిన పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాల్లో ఒక్క చర్చ కూడా జరగకుండా విపక్షాలు నిత్యమూ రాద్ధాంతం చేస్తూ, నిరసనలు తెలిపాయని ఆరోపిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉపవాసదీక్షను ప్రారంభించారు. బడ్జెట్ సమావేశాలు వృథా కావడానికి విపక్షాల వైఖరే కారణమని మోడీ ఇప్పటికే విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. 
 
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, బడ్జెట్ సమావేశాల్లో చేసిందంతా చేసి ఇప్పుడు తమపై నిందలేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ రభసకు కారణం మోడీయేనని వ్యాఖ్యానించిన ఆయన, తమకు అవసరమైన బిల్లులను ఆమోదింపజేసుకునే సమయంలో సభ ఆర్డర్‌లో లేదన్న సంగతి గుర్తుకురాలేదా? అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.