బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (09:11 IST)

విక్రమ్ కోసం నాసా : జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్‌ ద్వారా సంకేతాలు.. ఇస్రో ఖుషీ

చంద్రుడి దక్షిణ ధృవం అన్వేషణ నిమిత్తం పంపిన విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్‌ కారణంగా ఇస్రోతో సంపంధాలు తెగిపోయాయి. ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో గుర్తించే పనిలో ఇస్రో శాస్త్రవేత్తలు నిమగ్నమైవున్నారు. ఈ నేపథ్యంలో జాబిల్లిపై దాగివున్న విక్రమ్ ల్యాండర్‌ కోసం అమెరికా పరిశోధనా సంస్థ ఇస్రో రంగంలోకి దిగింది. విక్రమ్తో సంబంధాలు పునరుద్ధరణ కోసం కృషి చేస్తోంది. ఇప్పటికే విక్రమ్‌ నుంచి స్పందన కోసం డీప్‌స్పేస్‌ నెట్‌వర్క్‌ సెంటర్ల ద్వారా, జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్‌ ద్వారా రేడియో సంకేతాలు పంపుతోంది. 
 
అంతేకాదు.. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో ఉన్న నాసా 'లూనార్‌ ఆర్బిటర్' ఈ నెల 17వ తేదీన ల్యాండర్‌ ఉన్న వైపునకు వెళ్లనుంది. ఆ సమయంలో అది ఫొటోలు తీస్తుందని శాస్త్రజ్ఞులు వివరించారు. ఆ చిత్రాలను ఇస్రోతో పంచుకుంటామని నాసా అధికార ప్రతినిధి తెలిపారు. ఇంతకీ విక్రమ్‌పై నాసా ఎందుకింత ఆసక్తి చూపుతోందనే ప్రశ్నకు ఒక కారణముంది.
 
అదేంటంటే.. ల్యాండర్‌ విక్రమ్‌లో అమర్చిన పరికరాల్లో నాసా గొడార్డ్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌కు చెందిన 'లేజర్‌ రెట్రోరిఫ్లెక్టర్‌ యారే' కూడా ఉంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి 2024లో వ్యోమగాములను పంపేందుకు నాసా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు నాసా ఈ ఎల్‌ఆర్‌ఏను ల్యాండర్‌లో చేర్చింది. కానీ, విక్రమ్‌ నుంచి చివరక్షణంలో సంకేతాలు ఆగిపోవడంతో ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు నాసా కృషి చేస్తోంది.