శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 26 నవంబరు 2019 (10:24 IST)

పగపట్టిన నాగుపాము.. ఏం చేసిందో తెలుసా ?

నెల్లూరు జిల్లా  సైదాపురం మండలం మొలకలపూండ్ల దళిత వాడకు చెందిన మోడేగుంట పుల్లయ్య ఆటో నడుపుకుండా జీవనం సాగిస్తుంటాడు. అతడు నివాసం ఉండే ఇంటి దగ్గిర పైపులోకి  4 అడుగులు ఉన్న తాచుపాము దూరింది. పాము పైపులో నుంచి రాకపోవడంతో పెట్రోలు పోసి పైపులుకు నిప్పు పెట్టారు. దీంతో పైపులో ఉన్న పాము బయటకు వచ్చింది. స్థానికులు పామును చంపేశారు. 
 
అయితే పుల్లయ్య చెపుతున్న కథనం ప్రకారం తన ఆటో పొరబాటుగా పామును తొక్కిందని అయితే ఆ పాము పగబట్టి సుమారు 10 కిలో మీటర్లు ప్రయాణం చేసి వచ్చిందని చెబుతున్నాడు. అందుకే పామును చంపేవరకూ నాతో పాటు నా కుటుంబం అంతా దేవాలయంలో తలదాచుకుందని వాపోతున్నాడు. ఒక ప్రక్క పాములు పగబట్టవని స్నేక్ సొసైటీ వారు చెబుతున్నా ఆ గ్రామస్థులు మాత్రం పాము పగబట్టే వచ్చిందని వాపోతున్నారు.