శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (14:17 IST)

ట్రెడ్‌ మిల్‌ కింద పిల్లాడు.. నొప్పిని తట్టుకోలేక గిలాగిలా కొట్టుకున్నాడు..

treadmill
పసిపిల్లలు, పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు ట్రెడ్‌ మిల్‌ దరిదాపుల్లోకి రానివ్వకపోవడం మంచిది. అలా ట్రెడ్‌ మిల్‌ ఉన్నచోట పొరపాటున మీ పిల్లలు వస్తే ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో చెప్పేందుకు ఓ వీడియోనే నిదర్శనం. ఈ వీడియోని యూఎస్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్‌ సేఫ్టీ కమిషన్‌ విడుదల చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. అక్కతో కలిసి ఆడుకుంటున్న చిన్నారిని ట్రెడ్‌ మిల్‌ అమాంతం లాగేసింది. చిన్నారి చేతులు ట్రెడ్‌ మిల్‌ కింద నలిగాయి. ఆ తర్వాత కాసేపటికే పిల్లాడు కూడా ట్రెడ్‌ మిల్‌ కిందకు వెళ్లిపోయాడు. నొప్పిని తట్టుకోలేక కాసేపు ఆ చిన్నారి గిలాగిలా కొట్టుకున్నాడు. అతి కష్టం మీద బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఏడ్చుకుంటూ అక్కడి నుంచి పరుగులు పెట్టాడు.
 
ఆ చిన్నారి అదృష్టం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే చనిపోయేవాడు. ఇలాంటి ఘటనలు అమెరికాలో జరగడం ఇది మొదటిసారి కాదు. పెలటాన్‌ కంపెనీకి చెందిన ట్రెడ్‌ మిల్‌ ప్లస్‌ వల్ల ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా 40మందికి పైగా చిన్నారులు గాయపడ్డారు. 
 
ఈ కంపెనీ ట్రెడ్‌ మిల్‌‌ని వాడవద్దని ఇప్పటికే అమెరికా కంజుమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్‌ ఆదేశించింది. అయితే సదరు కంపెనీ ఈనిర్ణయాన్ని తప్పుబట్టింది. 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉండే వ్యక్తులు దీన్ని ఉపయోగించకూడదని సేఫ్టీ రూల్స్‌ లో స్పష్టం చేశామని వివరణ ఇచ్చింది.