శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (14:10 IST)

నిజాముద్దీన్‌లో ఏం జరిగిందో తెలుసా?

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపించడానికి ప్రధాన కారణం ఢిల్లీలో వెస్ట్ నిజాముద్దీన్‌లో జరిగిన ఓ మత కార్యక్రమం అని నిర్ధారణ అయింది. ఈ కార్యక్రమానికి కరోనా బాధిత  దేశాలకు చెందిన అనేక మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వీరి ద్వారా ఈ కార్యక్రమానికి వెళ్లిన ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఈ వైరస్ అంటుకుంది. అది అలా అలా వ్యాపించి... దేశంలో కరోనా ప్రబలడానికి మూలకారణమైంది. అసలు నిజాముద్దీన్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 
 
నిజాముద్దీన్ అనేది ఓ సూఫీ సంస్థ. దీని ఆధ్వర్యంలో అనేక మతపరమైన కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంటాయి. మార్చిలో కూడా అలాంటి కార్యక్రమమే ఢిల్లీలో జరిగింది. ఇదే కరోనా భుగ్గుమని దావనలంలా వ్యాపించడానికి కారణభూతమైంది. అనేక మంది ప్రాణాలు పోవడానికి కేంద్ర బిందువుగా మారింది. హైదరాబాద్‌, ఖైరతాబాద్‌లో వృద్ధుడి మరణానికి కూడా ఈ మతపరమైన కార్యక్రమమే కారణంగా నిలిచింది. 
 
 
ఈ నిజాముద్దీన్ ఆధ్వర్యంలో మర్కజ్ మసీదు భవన సముదాయంలో మతపరమైన కార్యక్రమం జరిగింది. సుప్రసిద్ధ ఖ్వాజా నిజాముద్దీనిన్ ఔలియా క్షేత్రానికి పక్కన ఉంటుంది. మసీదు పక్కనే 25 వేల జనాభా కలిగిన బస్తీ ఉంటుంది.
 
మర్కజ్‌లో మార్చి 1-15 తేదీల మధ్య జరిగిన తబ్లిఘ్ జమాత్ అనే కార్యక్రమానికి భారత్‌తోపాటు ఇండోనేసియా, మలేసియా తదితర దేశాలకు చెందిన 2,000 మంది ప్రతినిధులు నిజాముద్దీన్‌లో హాజరయ్యారు.
 
ఈ కార్యక్రమానికి హాజరైనవారు ఏడుగురు హైదరాబాద్‌లో కరోనాతో మరణించారు. మరొక వ్యక్తి శ్రీనగర్‌లో మరణించారు. ప్రతినిధుల్లో కనీసం 37 మందికి కరోనా సోకింది. ఆదివారం పాజిటివ్ వచ్చిన 24 మంది అందులో భాగమే. 
 
ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో తెలంగాణ, కర్నాటక, ఒడిశా, బీహార్, జమ్ముకశ్మీర్ తదితర రాష్ట్రాలకు చెందివారు ఉన్నారు. జనతా కర్ఫ్యూ జరిగిన మార్చి 22న పోలీసు బృందాంలు మసీదు దగ్గర నిలబడి సమావేశాలు జరగకుండా అడ్డుకున్నారు. ఆ తేదీ నుంచి బయటివారిని ఎవరినీ లోపలకు అనుమతించలేదు.