శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 3 నవంబరు 2021 (17:39 IST)

నా చర్మం వలిచి వారికి చెప్పులు కుట్టించినా రుణం తీరదు: ఈటెల రాజేందర్

హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన ఈటెల రాజేందర్ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. "నా ఘన విజయం సాధించిపెట్టిన నియోజకవర్గ ప్రజలకు ఎంతచేసినా రుణం తీర్చుకోలేను. ఆఖరికి నా చర్మం వలిచి వారి కాళ్లకు చెప్పులు కుట్టించినా రుణం తీరదు. అంతటి ఆప్యాయత నాపై చూపించారు.

 
నేను నియోజకవర్గ పర్యటనకు వెళ్లినప్పుడు దళితబంధు నిధులకు లొంగుతామా బిడ్డా అని వారు నాతో అన్నారు. వందల కోట్లు డబ్బు వెదజల్లారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసారు. అయినా వారు లొంగలేదు.

 
కేసీఆర్ మొహంతో నేను ఎన్నికలకు వచ్చినప్పటికంటే ఇపుడు నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. కేవలం 2 గుంటల మనిషి 400 కోట్లు ఎట్లా ఖర్చు పెడతడు.

 
నాపై ఇంతటి నమ్మకాన్ని వుంచిన ప్రజలను కళ్లలో పెట్టి చూసుకుంటాను. నా గెలుపుకు శ్రమించిన భాజపా శ్రేణులకు ధన్యవాదాలు. అమిత్ షా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.