సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 3 నవంబరు 2021 (14:19 IST)

రానున్నరోజుల్లో ఎ.పి.లోనూ హుజూరాబాద్ ఫలితాలు!

బ‌ద్వేల్ లో నైతిక విజయం తమదన‌ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బిజెపి తాము ఏం చేసామో తెలుపుతూ కరపత్రాలు ఇచ్చి ఓట్లు అడిగితే,  వైసీపీ డబ్బులిచ్చి ఓట్లు అడిగిందన్నారు. తామంతా ప్రజాస్వామ్యబద్దంగా ఓటింగ్ జరగాలని కోరుకుంటే, వైసీపీ బయటి వ్యక్తులును సైతం తీసుకువచ్చి రిగ్గింగ్ కు పాల్పడిందని ఆయన విమర్శించారు. 
 
 
వైసీపీ తరుపున ఐదుగురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు ప్రచారం చేసారన్నారు. సి.ఎం. సొంత జిల్లాలో ఓట్లు కొనుక్కునే దుస్థితి వై.సి.పి.కి  వచ్చిందని విమర్శించారు. రానున్నరోజుల్లో ఎ.పి.లోనూ హుజూరాబాద్ లాంటి ఫలితాలు  వస్తాయన్నారు. బి.జె.పి-జనసేనలు కలసి ఎ.పి.లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు సోము వీర్రాజు. స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణకు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ స్టీలు ప్లాంట్ ప్రవేటీకరణ చెయ్యొద్దనే  మేము కేంద్రాన్ని కోరామన్నారు సోము వీర్రాజు.