బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: మంగళవారం, 12 నవంబరు 2019 (18:38 IST)

మనిషి ముఖంతో చేప, ఎక్కడ?(Video)

ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతాయన్నది అందరికీ తెలిసిందే. అయితే కొన్ని వింతలు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి ఒక వింతే చైనాలో చోటు చేసుకుంది.
 
చైనాలోని మియావో గ్రామంలో ఓ టూరిస్ట్ కెమెరాకు వింతైన చేప చిక్కింది. దాని ముఖం అచ్చం మనిషిని పోలినట్లే ఉంది. మనిషి తలలాగానే ముక్కు, కళ్ళు, నోరు ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి అరుదైన చేప ఎక్కడా లేదంటున్నారు చైనా ప్రజలు. ఈ వీడియో కాస్త చైనా ప్రభుత్వం ఇంటర్నెట్లో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. జనం ఎంతో ఆసక్తిగా ఈ వీడియోను తిలకిస్తున్నారు.