శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (20:54 IST)

గ్యాప్ ఇవ్వలా, దానంతట అదే వచ్చింది: జగన్‌తో విజయసాయిరెడ్డికి ఎందుకు అంతదూరం? (Video)

వైసిపిలోనే నెంబర్ 2 విజయసాయిరెడ్డి. ఇది అందరికీ తెలిసిందే. జగన్ తరువాత ఏ నిర్ణయలైనా విజయసాయిరెడ్డి తీసుకోవాలి. ఆయన సిఎంకు ఏం చెబితే అదేనన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డి బాగా దూరంగా ఉంటూ వస్తున్నారట.
 
అందుకు కారణం జగన్మోహన్ రెడ్డేనంటున్నారు ఆ పార్టీ నేతలు. విజయసాయిరెడ్డికి సిఎంకు మధ్య కాస్త గ్యాప్ పెరిగిందట. వైజాగ్ ఇన్‌ఛార్జ్‌గా విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించినా కూడా అక్కడి నుంచి తాడేపల్లికి వచ్చి జగన్‌ను కలవలేదట. 
 
కలవడానికి కూడా విజయసాయిరెడ్డి ప్రయత్నించడం లేదట. దీంతో వీరి మధ్య గ్యాప్ బాగా పెరిగిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అందుకు ఉదాహరణ కూడా ఆ పార్టీ నేతలే చెప్పేస్తున్నారట.
 
ఢిల్లీలో ప్రాధాన్యం తగ్గిస్తూ రిటైర్డ్ సిఎస్ ఆదిత్యానాధ్ దాస్‌కు హస్తిన బాద్యతలు అప్పగించడం. ఆ తరువాత ఎస్.అనిల్ రెడ్డిని విజయసాయిరెడ్డి ప్లేస్‌లో పెట్టాలన్న నిర్ణయం తీసుకోవడం లాంటివి జరుగుతున్నాయట. దీంతో విజయసాయిరెడ్డికి అన్ని తెలిసినా సైలెంట్‌గా ఉన్నారట. ఏం జరుగుతుందో వేచి ఉందామన్న ధోరణిలో ఉన్నారట విజయసాయిరెడ్డి.