శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 జూన్ 2024 (17:44 IST)

వాకింగ్ వెళ్లిన దంపతులను తరుముకున్న గజరాజు.. ఎక్కడ?

Wild elephant
Wild elephant
కోయంబత్తూరులో అటవీ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాకింగ్ వెళ్లిన కోవై దంపతులకు గజరాజు చుక్కలు చూపించింది. అడవి నుంచి నేను కూడా వాకింగ్ వచ్చానన్న రీతిలో ఆ దంపతుల వెంటపడింది. అంతే ఆ దంపతులు గజరాజును చూసి భయపడి పరుగులు తీశారు. అయినా ఆ ఏనుగు ఆ దంపతుల ఇంటి వరకు వచ్చింది. గేటు తెరిచి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. 
 
కోవై జిల్లా, మరుదమలై పశ్చిమ శ్రేణి పర్వత ప్రాంతం. ఇక్కడ గత కొన్ని రోజులుగా సుమారు 11 ఏనుగులు నివాస ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. ఈ ఏనుగులు ఆహారం, నీరు కోసం రాత్రి వేళల్లో ప్రజల నివాస ప్రాంతంలోకి వస్తున్నాయి. 
 
ఆ విధంగా వచ్చే ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతంలోకి తిరిగి పంపేందుకు అటవీశాఖా అధికారులు సిద్ధంగా వుంటారు. ఈ నేపథ్యంలో నిన్న శనివారం రాత్రి, మరుదమలై సమీపంలో ఉన్న భారతీయర్ విశ్వవిద్యాలయం సమీపంలోని నివాస ప్రాంతంలో సాయంత్రం వాకింగ్ వెళ్లిన దంపతులు అడవి ఏనుగును చూసి షాకయ్యారు. వెంటనే ఆ దంపతులు ఇంట్లోకి పరుగులు పెట్టారు. ఆపై ఆ ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.