శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 12 జులై 2018 (16:00 IST)

బీజేపీ మళ్లీ గెలిస్తే భారత్ అలా మారిపోతుంది : శశిథరూర్

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే భారత్ హిందూ పాకిస్థాన్ అయిపోతుందంటూ వ్యాఖ్యానించారు. తిరువనంతప

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే భారత్ హిందూ పాకిస్థాన్ అయిపోతుందంటూ వ్యాఖ్యానించారు. తిరువనంతపురం నగరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ కొత్త రాజ్యాంగాన్ని లిఖిస్తుందని ఆరోపించారు.
 
పాకిస్థాన్ దేశంలో మైనారిటీల హక్కులకు గౌరవం లేనట్లే ఇక్కడ కూడా బీజేపీ పాక్ తరహాలో పాలన సాగించే ప్రమాదం ఉందన్నారు. దేశంలో బీజేపీ మరోసారి విజయం సాధిస్తే ప్రజాస్వామ్యయుతంగా ఉన్న మన రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగాన్ని లిఖిస్తారని జోస్యం చెప్పారు. 
 
అంటే భారత్‌ను హిందూ పాకిస్థాన్‌గా మారుస్తారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి మండపడ్డారు. తక్షణం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.