సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 28 ఏప్రియల్ 2021 (20:08 IST)

తెరాసకి ఓటు వేస్తే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా, ఎవరు?

కోవిడ్ విజృంభిస్తున్నప్పటికీ ఎన్నికల కోలాహలం మాత్రం మామూలుగా వుండటంలేదు. మరో రెండు రోజుల్లో తెలంగాణలోని పరిధిలో ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి.

ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం చేసి హోరెత్తించారు. మంగళవారంతో ఎన్నికల ప్రచారం ముగియగా ఇప్పుడు కొత్త తరహాలో వరంగల్ జిల్లాలో ఓ ఫ్లెక్సీ దర్శనమిస్తోంది.
 
అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓ అభ్యర్థి ఫ్లెక్సీ పెట్టాడు. ఆ ఫ్లెక్సీలో చేతితో చెప్పును పట్టుకుని, తెరాసకి ఓటు వేస్తే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా అంటూ టాగ్ లైన్ పెట్టాడు. ఈ ఫ్లెక్సీని చూసిన జనం అవాక్కవుతున్నారు.