గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (22:00 IST)

కరోనా ఎఫెక్ట్.. పూరీ జగన్నాథ ఆలయం మూసివేత.. మే 15 వరకు..?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం మూతపడింది. రోనా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా పూరి జగన్నాథ్ ఆలయంలో వివిధ సమస్యలు తలెత్తుతాయని, ఇక్కడికి వచ్చే భక్తులతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ఆలయం బోర్డు అభిప్రాయపడింది. దీంతో ఆలయాన్ని మే 15 వరకు మూసివుంచనున్నట్లు అధికారులు తెలిపారు. 
 
పూరీ జగన్నాథ్ ఆలయంలో భక్తుల రాకను నిషేధించారని, రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా పూర్తవుతాయని సేవకులు తెలిపారు. మహాప్రభు చందన్ యాత్ర, అక్షయ తృతీయ, స్నాన్ యాత్ర, ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర రాబోయే రోజుల్లో జరుగనున్నాయి. అటువంటి పరిస్థితుల్లో బ్రేక్ వర్తించకపోతే ఇన్‌ఫెక్షన్ పెరిగిపోయి అసలుకే ముప్పు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
 
మరోవైపు, సాంప్రదాయం ప్రకారం ఈ ఏడాది రథం నిర్మాణ పనుల కొనసాగింపును మే 15 న అక్షయ తృతీయ రోజున ప్రారంభించనున్నారు. ఆలయంలో సేవకులకు మాస్క్‌లు, శానిటైజర్లు ఏర్పాటు చేయనున్నా. చందనం, స్నానం, రథయాత్ర కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్నది. పూరి జిల్లాలో శుక్రవారం 395 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు.