1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. ISRO Chief K Sivan explains the intricacies of the #Chandrayaan2 mission using a miniature model

విక్రమ్ ల్యాండింగ్ ముహూర్తం ఖరారు.. జాబిల్లిపై తొలి అడుగు ఎపుడంటే...

ISRO
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గత నెల 22వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్ 2 వాహకనౌక విజ‌య‌వంతంగా లూనార్ ఆర్బిట్‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు ఇస్రో ఛైర్మ‌న్ కే.శివ‌న్ మంగళవారం వెల్లడించారు. 
 
ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సెప్టెంబ‌రు 2వ తేదీన చంద్ర‌యాన్ ‌2కు సంబంధించి మ‌రో కీల‌క ఘ‌ట్టం ఉంటుంద‌న్నారు. ఆ రోజున ఆర్బిటార్ నుంచి ల్యాండ‌ర్ వేరుప‌డుతుంద‌న్నారు. ఇక సెప్టెంబ‌ర్ 3వ తేదీన సుమారు మూడు సెక‌న్ల పాటు ఓ చిన్న‌పాటి ప్ర‌క్రియ ఉంటుంద‌ని శివ‌న్ వివరించారు. 
 
ఆ ప్ర‌క్రియ‌తో ల్యాండ‌ర్ ప‌నితీరు తెలుస్తుంద‌న్నారు. ఇక సెప్టెంబ‌ర్ 7వ తేదీన‌, తెల్ల‌వారుజామున‌ 1.55 నిమిషాల‌కు చంద్రుడి ఉప‌రిత‌లంపై విక్ర‌మ్ ల్యాండ‌ర్ దిగుతుంద‌న్నారు. తామంతా మాన‌వ ప్ర‌య‌త్నం చేశామని, ప్రస్తుతం ల‌క్ష్యానికి మ‌రింత చేరువైన‌ట్లు ఇస్రో త‌న ట్విట్ట‌ర్‌లో చెప్పింది. 

 
తర్వాతి కథనం
పాలల్లో మత్తు పదార్థం కలిపి... ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన తనయ