శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (12:12 IST)

గురు, శని గ్రహాలు ఆకాశంలో అలా కలుస్తాయట.. భారత్‌లో సాయంత్రం 6.30 నుంచి..?

Jupiter-Saturn
డిసెంబర్ 21వ తేదీ (సోమవారం) సాయంత్రం రెండు గ్రహాలు ఒకదానినొకటి దాటి వెళతాయి. గురు, శని ఈ రెండు గ్రహాలు ఒక దానినొకటి దాటుతూ, ఒక చోట కలిసిపోయినట్లు కనిపిస్తాయి. అప్పుడు మన కంటికి పెద్ద వెలుగు కనిపిస్తుంది. రెండు గ్రహాలు ఒకే కక్ష్యలో (డబుల్ ప్లానెట్) ఉన్నట్లు కనిపిస్తాయి.
 
డిసెంబర్ నెలలో క్రిస్మస్ సమయంలో ఈ అద్భుతం జరగబోతుండడంతో, రెండు వేల సంవత్సరాల క్రితం ఆకాశంలో కనిపించిన బ్రహ్మాండమైన కాంతి ఇదే అయి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. దీన్ని 'స్టార్ ఆఫ్ బెత్లెహం' అంటారు. ఖగోళ శాస్త్రం మీద ఆసక్తి ఉన్నవారు, నక్షత్రాలను, గ్రహాలను పరిశీలించేవారు ఆకాశంలో ఈ కలయికను వీక్షించవచ్చు. భారత్‌లో సాయంత్రం 6.30 నుంచి 7.30 మధ్యలో ఇది కనిపించే అవకాశం ఉందని ఖగోళ నిపుణులు చెబుతున్నారు.
 
సాయంత్రం పూట ఆకాశం వైపు చూస్తే.. ఆ రెండు గ్రహాలు దగ్గరగా వస్తున్న సంగతి తెలుస్తుంది. వాతావరణం ఎప్పుడు, ఎలా మారుతుందో తెలీదు కాబట్టి వెంటనే చూస్తే మేలు. మంచి అవకాశం కోల్పోకుండా ఉంటాం" అని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీకి చెందిన డా. కరోలిన్ క్రాఫోర్డ్ తెలిపారు. సాయంత్రం సూర్యుడు అస్తమించగానే ఆకాశంలో నైరుతి దిశగా ఈ రెండు గ్రహాలనూ చూడవచ్చు.