ప్లీజ్... మీకు దణ్ణం పెడుతున్నా, డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు: యాంకర్ అనుశ్రీ కన్నీళ్లు

Anchor Anusri
ఐవీఆర్| Last Modified శనివారం, 3 అక్టోబరు 2020 (15:17 IST)
కన్నడ డ్రగ్స్ కేసు ఆ చిత్ర పరిశ్రమను కుదుపులకు గురిచేస్తోంది. సంజనా, రాగిణిలు ఇప్పటికే అదుపులో వున్నారు. విచారణలో వీరు చెప్పిన వివరాలను ఆధారం చేసుకుని దర్యాప్తు సాగుతోంది. ఇందులో భాగంగా ఇటీవలే శాండల్‌వుడ్ యాంకర్ అనుశ్రీని అధికారులు పిలిచారు.

ఆ తర్వాత మీడియాలో ఆమె గురించి విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఆమెకి డ్రగ్స్ కేసుతో లింకు వుందంటూ రాస్తున్నారు. దీనిపై యాంకర్ అనుశ్రీ కన్నీటిపర్యంతమైది. తనకు ఏమీ తెలియదనీ, తనను సీసీబీ అధికారులు విచారించినంత మాత్రాన నేరస్థురాలిని కాదనీ, మీకు దణ్ణం పెడుతున్నా, దుష్ర్పచారం చేయొద్దండీ ప్లీజ్ అంటూ వేడుకుంది. ఈ మేరకు ఆమె ఓ వీడియోను పోస్టు చేసింది.దీనిపై మరింత చదవండి :