గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (12:10 IST)

స్నేహం కోసం సీన్ రిపీట్: కారు షోరూమ్ సేల్స్‌మెన్‌కు రైతు షాక్

Mahindra
స్నేహం కోసం సినిమాలో కార్ల షోరూమ్‌కు వెళ్లి పంచెకట్టు, పల్లెటూరి వాలకం చూసి ఎగ్జిక్యూటివ్ అవహేళన చేసిన సీన్  గుర్తుందిగా. ఇలాంటి సీనే ప్రస్తుతం రిపీట్ అయ్యింది. కర్ణాటకలో తుమకూరు నగరానికి చెందిన పక్క తోట రైతు కెంపే గౌడ మిత్రులతో కలిసి మహీంద్ర కార్ల షోరూంకు వెళ్లారు. మహీంద్రా షోరూమ్‌లోకి ఓ రైతు వెళ్లి తనకు బోలేరో పిక్ అప్ వాహనం కావాలని చెప్పాడు. 
 
మహీంద్రా షోరూమ్‌లో ఉన్న సేల్స్‌మెన్ ఆ రైతును చూసి ఓరి పిచ్చోడా బోలేరో పిక్ అప్ వాహనం ఖరీదు రూ. 10 లక్షలు వెళ్లిపొమ్మంటూ చులకనగా మాట్లాడి ఆ రైతును అవమానించి ఆయన్ను షోరూమ్‌లో నుంచి బలవంతంగా బయటకు పంపించేశాడు. 
 
దీంతో గంట తర్వాత రూ. 10 లక్షలు నెట్ క్యాష్ ఎత్తుకుని నేరుగా వెళ్లి షోరూమ్ లో పెట్టి బోలేరో పిక్ వాహనం డెలవరీ ఇవ్వాలని చెప్పాడు. కార్లు స్టాక్ లేకపోవడంతో నాలుగు రోజులు సమయం కావాలని షోరూమ్ లోని ఆ సేల్స్ మెన్ చెప్పాడు.
 
రైతుకు ఎక్కడో మండిపోయి నువ్వు ఎంత, నీ బతుకెంత ?, నా దగ్గర రూ. 10 రూపాయలు లేవు అంటావా ?, డబ్బు తెచ్చినా కారు ఇవ్వు అంటూ మండిపడటంతో అందరూ షాక్ అయ్యారు. అక్కడ జరిగిన తతంగా మొత్తం వీడియో తీసిన రైతు స్నేహితులు ఆ వీడియోను ఆనంద్ మహింద్రాకు ట్యాగ్ చేస్తూ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో  వైరల్ అయ్యింది.