కీర్తి సురేష్ ఏమైంది? సన్నగా బక్కచిక్కిపోయి అందవిహీనంగా?

Keerti Suresh
జె| Last Modified సోమవారం, 11 జనవరి 2021 (15:25 IST)
కీర్తి సురేష్. ఎన్నో తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మెప్పించారు. అగ్రహీరోయిన్లలో ఒకరు. అలాంటి కీర్తి సురేష్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలిస్తే భయపడిపోతారు. చాలా సన్నగా, అంద విహీనంగా.. బక్కచిక్కిపోయి...ఇదంతా ఎక్కడంటే?

శ్రీవారిని దర్సించుకున్నారు కీర్తి సురేష్. దర్సనానంతరం కీర్తి సురేష్‌ను ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. దూరంగా ఉన్నవారు అస్సలు గుర్తు పట్టలేదు.. పట్టించుకోలేదు కూడా. దగ్గరగా చూసిన వాళ్లు మాత్రమే కీర్తి సురేష్ కదా.. హీరోయిన్ కదా..

అబ్బా.. ఎందుకలా అయిపోయింది.. ముఖమంతా పీక్కుపోయిందే.. మరీ సన్నగా కనబడుతోందే అంటూ గట్టిగా అరుచుకుంటూ మాట్లాడుకున్నారు. అయితే కీర్తి సురేష్ మాత్రం ఎవరికి ఫోటోలకు ఫోజులివ్వకుండా వేగంగా నడుచుకుంటూ కారు ఎక్కి వెళ్లిపోయారు. కరోనా కారణంగా తమిళనాడులో ఖాళీగా ఉన్నారు హీరో, హీరోయిన్లు. అయితే ఎక్కువగా డైట్ చేయడం వల్ల కీర్తి మరీ సన్నబడినట్లుంది.దీనిపై మరింత చదవండి :