కృష్ణంరాజు ఆరోగ్యం భేష్, తీవ్ర అనారోగ్యం వార్తలు క‌రెక్ట్ కాదు

krishnam raju
శ్రీ| Last Modified గురువారం, 14 నవంబరు 2019 (16:11 IST)
రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు, ఆయ‌న ఆరోగ్యం బాగాలేదనీ, ప్ర‌స్తుతం ఆయ‌నను ఐసీయూలో ఉంచి, నిపుణులైన వైద్య బృందంతో చికిత్సను అందిస్తున్నారంటూ వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మీడియాలో వ‌స్తున్న వార్త‌లపై కృష్ణంరాజు ప్ర‌తినిధులు స్పందించారు.

కృష్ణంరాజు గారు... చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న‌ వార్తలు కరెక్ట్ కాదు. నిమోనియా వస్తే చెకప్ కోసం కేర్ ఆసుపత్రికి వెళ్లారు. అంతేత‌ప్ప... ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం ఏమీ లేదు అని చెప్పారు.దీనిపై మరింత చదవండి :