శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 25 అక్టోబరు 2019 (13:15 IST)

వామ్మో చెట్టు కింద చిరుత, ఇంతకీ మన హీరోలు ఏరీ?

చిరుత పులి గురించి వేరే చెప్పక్కర్లేదు. అత్యంత వేగంగా పరుగెత్తడమే కాదు అనుకుంటే ఏ చెట్టు పైనుంచి ఏ చెట్టుపైకి అయినా దూకేయగలదు. అలాంటి చిరుత హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చేసింది. 
 
బైకర్లు తమ బైకులను పార్క్ చేసి ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వుండగా హఠాత్తుగా అక్కడికి రావడంతో అంతా భీతిల్లిపోయి చెట్టెక్కేశారు.
 
ఐతే ఆ చెట్టును కూడా ఎక్కేయగల చిరుత మాత్రం బైకులపై స్త్వైర విహారం చేసింది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూకుతూ మోటార్ బైకులను కిందపడేసింది. ఆ తర్వాత రోడ్డుపై అక్కడే హాయిగా పడుకుంది. 
 
బాహుబలిలో అన్నట్లు మన హీరోలంతా చిరుత దెబ్బకు చెట్టు ఎక్కేశారు. ఆ తర్వాత సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు చేరవేశారు. ఈ ఘటన ఛత్తీస్ గడ్ పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.