సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (22:03 IST)

రియల్ టైగర్‌తో ఫైట్ చేసిన యంగ్ టైగర్... రాజమౌళి ఆర్ఆర్ఆర్ బీభత్స సన్నివేశం...

మామూలుగా సినిమాల్లో అన్నీ డూప్‌లే ఉంటాయి. హీరోలు ప్రాణాలకు తెగించి షూటింగ్‌లో పాల్గొన్న సంధర్భాలు చాలా తక్కువే. అయితే ఎన్టీఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి హీరోలు తమ ప్రాణాలకు తెగించి గతంలో షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి పనే చేస్తున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.
 
ఏకంగా చిరుతపులితోనే ఫైటింగ్ చేశారట. సంచలన దర్శకుడు రాజమౌళి దర్సకత్వంతో తెరకెక్కుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. ఎన్టీఆర్ కొమరం భీంగాను, రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగాను నటిస్తున్నారు. సినిమా జూలై 30వ తేదీన రిలీజ్ కాబోతోంది.
 
అయితే బల్గేరియా అడవుల్లో జరుగుతున్న షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ నిజమైన చిరుతపులితో ఫైట్ చేశారట. ఆ సన్నివేశాలను కెమెరాలో చిత్రీకరించారట. సాధారణంగా పులితో ఫైటింగ్ అంటే గ్రాఫిక్స్ ఉంటాయి. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ రియల్ టైగర్‌తో ఫైట్ చేయడం మాత్రం ప్రస్తుతం అభిమానులను ఆందోళనను కలిగిస్తోంది. అయితే ఫైటింగ్ సీన్ పూర్తయిన తరువాత తనకేమీ కాలేదని జూనియర్ ఎన్టీఆర్ యూనిట్ సభ్యులకు చెప్పారట. సినిమా విడుదలయ్యేంత వరకు పోరాట సన్నివేశాలను బయటకు రానివ్వకుండా రాజమౌళి జాగ్రత్త పడుతున్నారు.