శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 14 సెప్టెంబరు 2019 (22:39 IST)

మ‌రింత ముదురుతున్న వాల్మీకి వివాదం...

మెగా హీరో వ‌రుణ్ తేజ్ - టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం వాల్మీకి. ఈ చిత్రంలోని పాట‌ల‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భిస్తుంది. దీంతో ఈ సినిమాపై మెగా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ఇదిలావుంటే... ఈ మూవీ టైటిల్ వివాదాస్పదం కావడం తెలిసిందే. వాల్మీకి టైటిల్ మార్చాల్సిందేని బోయ హక్కుల పోరాట సమితి పోరాటం కొనసాగిస్తోంది. దీనిపై వారు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసారు.
 
తాజాగా ఆ పిటిషన్ పైన విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో, హైకోర్టు వాల్మీకి హీరో వరుణ్ తేజ్‌తో పాటు, చిత్ర యూనిట్‌కు, రాష్ట్ర డీజీపీకి, సెన్సార్ బోర్డుకు, ఫిలించాంబర్‌కు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ మరో నెల రోజుల తర్వాత ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే వాల్మీకి చిత్రం ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. 
 
ఈ సినిమా సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ టైటిల్ పైన ఇంత ర‌చ్చ జ‌రుగుతున్న‌ప్ప‌టికీ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ మాత్రం చాలా కూల్‌గా మూవీ ప్ర‌మోష‌న్ చేసుకుంటున్నారు. రోజురోజుకు ముదురుతున్న ఈ వివాదం ఎలా ముగుస్తుందో?