శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2019 (08:42 IST)

ఆ విగ్రహాలు గాంధీ ఆశయాలకు ప్రతిరూపాలు...

ఆఫ్రికా దేశాల్లో ఒకటి సౌతాఫ్రికా. ఇక్కడ జాత్యహంకారం, వర్ణవివక్ష తీవ్రస్థాయిలో ఉండేది. తెల్ల జాతీయులదే ఆధిపత్యం. వీరికాళ్ళ కింద నల్లజాతీయులు (ఆఫ్రికన్లు) నలిగిపోతూ వచ్చారు. అలాంటి జాత్యహంకారాన్ని, వర్ణ వివక్షతను కూకటి వేళ్ళతో పెకళించడానికి భారత జాతిపిత మహాత్మాగాంధీ సాగించిన ఉద్యమాలు యువతరానికి ఎంతో స్ఫూర్తిని కలిగించాయి. ఫలితంగా సౌతాఫ్రికా వ్యాప్తంగా గాంధీ విగ్రహాలు, ప్రతిమలు వెలశాయి. ఇవే నాటి గాంధీ ఆశయాలకు సాక్షీభూతంగా ఉన్నాయి. 
 
దక్షిణాఫ్రికా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాల్లో ఎక్కువగా బోడితల, కళ్లద్దాలు, ధోవతి, కలిగి ఉన్నవే ఉండటం గమనార్హం. పీటర్‌మారిట్జ్‌బర్గ్, జొహన్నెస్‌బర్గ్ ప్రాంతాల్లో మాత్రం గాంధీ యువన్యాయవాదిగా దేశానికి వచ్చిన నాటి రూపంతో చెప్పుకోదగిన విగ్రహాలు కనిపిస్తుంటాయి. తెల్లజాతీయుల రిజర్వుడ్ రైలు కంపార్టుమెంటు నుంచి నిర్దాక్షిణ్యంగా గాంధీ నెట్టివేసింది కూడా పీటర్‌మారిట్జ్‌బర్గ్ స్టేషన్‌లోనే. ఈ సంఘటనే గాంధీ సత్యాగ్రహానికి పురిగొల్పింది. 
 
ఈ ప్రతిమలో ఒకవైపు దక్షిణాఫ్రికాకు పాశ్చాత్య దుస్తుల్లో వచ్చిన నాటి యువన్యాయవాది గాంధీ రూపం కాగా, రెండోవైపు 21 ఏళ్ల తర్వాత భారతీయ వస్త్ర ధారణలో దక్షిణాఫ్రికా నుంచి వెళ్లిపోతున్న గాంధీ రూపం మలిచి ఉందని భారత హైకమిషనర్ రుచిర కాంబోజ్ వివరించారు. జాత్యాహంకారంపై దక్షిణాఫ్రికా వాసులు తిరుగుబాటు చేయడానికి మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా స్ఫూర్తి రగిలించారు. 
 
ఆ తర్వాత జొహనెస్‌బర్గ్ లోని వాణిజ్యకేంద్ర జిల్లాలో ప్రజారవాణా కూడలి గాంధీ స్కేర్‌గా 1999లో పేరు మార్చుకుంది. ఇక్కడ గాంధీ నిలువెత్తు విగ్రహం లాయరు దుస్తుల్లో కనిపిస్తుంది. ఎక్కడైతే ఆనాడు గాంధీ న్యాయ విద్యను ప్రాక్టీస్ కార్యాలయం ఉండేదో దానికి ఎదురుగానే ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. ఫోనిక్స్ సెటిల్‌మెంట్‌లో గాంధీ విగ్రహం టూరిస్టులకు ఆకర్షణగా నిలిచింది.
 
అంతేకాకుండా, ఈ ప్రదేశం ఒకప్పుడు గాంధీని, నెల్సన్ మండేలాను నిర్బంధించిన జైలు ప్రదేశం. 1908 నుంచి 1913 వరకు గాంధీ నాలుగుసార్లు ఇక్కడి జైలు పాలయ్యారని, ఇదే జైలులోని నాలుగో నెంబరు జైలు గదిలో గాంధీ మొట్టమొదటి సారి గడిపారు. ఎన్నిసార్లు అరెస్టయినా తన ఆశయాలను, లక్ష్యాలను వదులుకోడానికి గాంధీ ఇష్టపడలేదు. 
 
ఇప్పుడు గాజు బీరువాతో గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఇటీవల గాంధీ స్మారక కమిటీ టాల్‌స్టాయ్ ఫార్మ్ వద్ద గాంధీ విగ్రహాన్ని స్థాపించారు. ట్రాన్స్‌వాల్‌లో టాల్‌స్టాయ్ ఫార్మ్ అన్నది ఒక సమాజం. గాంధేయే దీన్ని 1910లో ప్రారంభించారు. గాంధీ ఆధ్వర్యంలోని సత్యాగ్రహ ఉద్యమానికి ఇది కేంద్రంగా ఆనాడు నిలిచింది. ఈ విధంగా దక్షిణాఫ్రికాలోని అడుగడుగున మహాత్ముని ఉద్యమాల స్ఫూర్తి విగ్రహాల రూపంలో సాక్షాత్కరిస్తుంది.