గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (18:58 IST)

పంజాబ్‌లో షాకింగ్ ఘటన: ట్రాక్టర్‌పై స్టంట్‌.. వ్యక్తి మృతి

Tractor
పంజాబ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్‌పై స్టంట్‌ చేసేందుకు ప్రయత్నించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల సుఖ్‌మన్‌దీప్ సింగ్ స్థానిక క్రీడా కార్యక్రమంలో పాల్గొన్నాడు. 
 
ఈవెంట్‌లో భాగంగా సుఖ్‌మన్‌దీప్ సింగ్ ట్రాక్టర్ స్టంట్ చేయడానికి సిద్ధమయ్యాడు. ముందుగా ఇంజన్ స్టార్ట్ చేసి ట్రాక్టర్ ముందు రెండు చక్రాలను పైకి లేపారు. ఇంజన్ ఆన్‌లోనే ఉండడంతో అటూ ఇటూ తిరగడం ప్రారంభించింది. ప్రమాదకరంగా వెళ్తున్న ట్రాక్టర్‌పై ఎక్కేందుకు సుఖ్‌మన్‌దీప్‌ సింగ్‌ ఎంతో ఉత్సాహంగా ప్రయత్నించాడు. 
 
ఒకసారి విఫలమై కిందపడిపోయాడు. వెంటనే ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లింది. సుఖ్‌మన్‌దీప్ సింగ్ లేవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి ప్రాణాలు కోల్పోయాడు.
 
 ముందు రెండు చక్రాలు ఎత్తుగా ఉన్న ట్రాక్టర్ ప్రమాదకరంగా తిరగడంతో సుఖ్‌మన్‌దీప్ సింగ్ దానిపైకి ఎక్కేందుకు ప్రయత్నించి కిందపడిపోయాడు. ట్రాక్టర్ అతడిపై నుంచి దూసుకెళ్లింది.
 
 స్థానికులు సుఖ్‌మన్‌దీప్‌ సింగ్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.