శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (16:00 IST)

షూ లేస్ కట్టుకుంటున్న బాలుడి పై నుంచి వెళ్లిన కారు? తర్వాత ఏమైందంటే?

బాలుడు కారుకు ముందు కూర్చుని కాలి షూ లేస్ కట్టుకుంటున్నాడు. కానీ కారు నడిపేందుకు సిద్ధమైన యువతి కారు స్టార్ట్ చేసింది. రోడ్డుపై కూర్చున్న బాలుడిని పట్టించుకోకుండా కారును నడిపింది. కారు బాలుడి పై నుంచి

బాలుడు కారుకు ముందు కూర్చుని కాలి షూ లేస్ కట్టుకుంటున్నాడు. కానీ కారు నడిపేందుకు సిద్ధమైన యువతి కారు స్టార్ట్ చేసింది. రోడ్డుపై కూర్చున్న బాలుడిని పట్టించుకోకుండా కారును నడిపింది. కారు బాలుడి పై నుంచి వెళ్లింది. కానీ ఈ ఘటనలో బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబయిలో సోమవారం రాత్రి ఓ యువతి నిర్లక్ష్యంగా కారు నడపడంతో ఓ బాలుడు గాయాలపాలయ్యాడు. రాత్రి సమయంలో చిన్నారులందరూ గల్లీలో ఫుట్‌బాల్ ఆడుతోన్న సమయంలో ఓ బాలుడు షూ లేస్‌ కట్టుకుంటూ కారు పక్కనే రోడ్డుపై కూర్చున్నాడు. అదే సమయంలో కారు ఎక్కిన యువతి ముందు చూసుకోకుండా కారును బాలుడి మీదకు పోనిచ్చింది. 
 
అదృష్టం కొద్ది బాలుడు కారు మధ్య భాగంలోకి జారాడు. కారు మీద నుంచి వెళ్లిన తరవాత లేచి ఏడుస్తూ బాలుడు స్నేహితుల దగ్గరకు పరుగులు పెట్టాడు. ఈ ఘటన సమీపంలోనే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. బాలుడికి ప్రాణాపాయం ఏమీ లేకున్నా స్వల్ప గాయాలయ్యాయి. 
 
ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కారు నడిపిన యువతితో పాటు.. ఆ బాలుడి తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఆ బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పుకోవడం అద్భుతమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.