శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 15 ఆగస్టు 2019 (12:43 IST)

త్వరలో వన్ నేషన్ - వన్ పోల్ జరుపుతాం : ప్రధాని నరేంద్ర మోడీ

దేశ ప్రజలు భారతదేశం మార్పుకోరుకుంటున్నారని వారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాల్లో అనేక మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
 
 అందులో భాగంగానే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను రద్దు చేసినట్లు తెలిపారు. వ్యవస్థలను గాడిలో పెట్టినట్లు తెలిపారు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం విధానంతో జమ్ముకాశ్మీర్ విభజించినట్లు తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకేదేశం అనే నినాదం ఇచ్చారని దాన్ని తాము స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. 
 
మరోవైపు వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే పేరుతో జీఎస్‌టీని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఒకే దేశం ఒకే మెుబిలిటీ కార్డు, ఒకే దేశం ఒకే వ్యవస్థ అనే విధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. త్వరలోనే వన్ నేషన్, వన్ పో పోల్ ప్రారంభం కాబోతుందని తెలిపారు. వైద్యఆరోగ్యరంగంలో అనేక మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు. 
 
రాబోయే ఐదేళ్లలో మెురుగైన భారత్‌ను నిర్మిస్తానని తెలిపారు. ఇప్పటివరకు 70యేళ్ళలో జరగని పనిని 70 రోజుల్లో చేసి చూపించినట్లు తెలిపారు. 2014, 2019 ఎన్నికల్లో దేశంలోని అన్ని ప్రాంతాలు పర్యటించానని అందరి కష్టాలను చూసినట్లు తెలిపారు. వారి ఆశలను నెరవేరుస్తానని మోడీ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా తమ ప్రభుత్వం అడుగుల వేస్తోందని ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 
 
దేశవ్యాప్తంగా తాగునీటి కష్టాలు లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లమేర నడవాల్సిన పరిస్థితి నెలకొందని అలాంటి పరిస్థితిని పూర్తిగా రూపుమాపేందుకు ప్రతీ ఇంటికి నీరు అందించాలనే ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ అనే పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ అనే పథకానికి వేల కోట్లాది రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టుకుంటామని తెలిపారు.