రాహుల్ గాంధీ బ్రహ్మచారినా..? లోలోపల ఏం జరుగుతుందో?: పవన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు, పవన్ వైవాహిక జీవితాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తే.. పవన్ కల్యాణ్ రాహుల్ గాంధీ బ్రహ్మచర్యాన్నీ లక్ష్యం చేసుకుని వ్యక్తిగత విమర్శలకు దిగారు. రాహుల్ బ్రహ్మచారని.. కాంగ్రెస్ వారు అంటున్నారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. కానీ లోలోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసునని ప్రశ్నించారు.
తాను కూడా వ్యక్తిగత విమర్శలు చేయగలనని, వ్యక్తిగత జీవితాల ప్రభావం పరిపాలన, శాసనాల నిర్దేశంపై ఉంటుందంటే.. తాను కూడా మాట్లాడతానని పవన్ తెలిపారు. వాటి ప్రభావం లేనప్పుడు తన గురించి మాట్లాడటం ఎందుకని పవన్ ప్రశ్నించారు.
అయితే పవన్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. రాష్ట్రంలో అన్ని సమస్యలుండగా, పవన్‌కు ఈ టాపిక్‌లే దొరుకుతాయా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రూల్స్ ఫర్ అధర్స్.. నాట్ ఫర్ పవన్ అని జనం సరిపెట్టుకోవాలని పవన్ అనుకుంటున్నాడేమోనని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యలపై, మోసం చేసిన మోదీ ఒక్క మాట కూడా పవన్ ఎందుకు అనరని వారు నిలదీస్తున్నారు.