1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి

తిరుమలలో విషసర్పం.. కరీంనగర్ జిల్లాలో అరిచే పాము..?!

Snake
తిరుమలలో విషసర్పం హల్‌చల్ చేసింది. పద్మావతి అతిథి గృహం వద్ద ఉన్న పార్కులో 8 అడుగుల పొడవు ఉన్న పాము రావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. కేకలు వేస్తూ పరుగులు తీశారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడిని పిలిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన పామును పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
 
అలాగే కరీంనగర్ జిల్లాలో అరిచే పాము కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మకాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గుర్తించారు. దీంతో పామును చూసిన ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారంటూ వెలిచాల గ్రామస్తుడు సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ అయింది. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. 
snake
 
దీనిపై స్థానిక ఎస్సై తాండ్ర వివేక్ స్పందించారు. ఇదంతా అసత్యమని వెల్లడించారు. అసలు నిజం ఏంటంలే.. ఈ వీడియోను నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్ మార్టిన్ అనే యూట్యూబర్ తన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడని ఎస్సై వివేక్ తెలిపాడు. దాన్ని డౌన్‌లోడ్ చేసిన ఓ వ్యక్తి.. వీడియోని వైరల్ చేశాడు. ఆ వీడియోను వెలిచాల గ్రామంలోదిగా పేర్కొంటూ ఆ ఆకతాయి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టు చేశాడని అన్నారు. 
 
సదరు యువకుడిని విచారిస్తున్నామని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్సై వివేక్ తెలిపారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు దీనిని 'ఈస్టర్న్‌ హాగ్‌నోస్‌ స్నేక్‌' అంటారని.. ఇది కేవలం నార్త్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఇది భారత్‌లో కనిపించదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.