శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2023 (10:30 IST)

జీ-20 జరుగుతుంటే.. బాబును అరెస్ట్ చేయడమా.. జగన్ చెత్తవాడు - ఆర్ఆర్ఆర్ ఫైర్

raghuramaraju
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు బాబు అరెస్ట్‌పై స్పందిస్తూ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విషయం లేదని.. గతంలో నేను బయటికి వచ్చినట్టుగానే చంద్రబాబు ఈ మధ్యాహ్నానికో, సాయంత్రానికో, లేక 24 గంటల లోపు బయటికి వచ్చేస్తారు. ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం కావడంతో చంద్రబాబు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ వేయాల్సి ఉంటుందన్నారు. లేకపోతే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు అంటూ రఘురామకృష్ణరాజు చెప్పారు. ఇలాంటి పెట్టీ కేసుతో చంద్రబాబును అరెస్ట్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? అంటూ జగన్‌ను ప్రశ్నించారు. 
 
ఓవైపు జీ20 సదస్సు జరుగుతోంది.. ప్రపంచ దేశాధినేతలు మనదేశానికి వచ్చిన వేళ అగ్రనేతను అరెస్ట్ చేయడం సరైంది కాదన్నారు. ఎన్నికల కోసమే ఈ అరెస్టు జరిగినట్లుందని, ఏపీ ముఖ్యమంత్రి చెత్తవాడని తెలుసు కానీ, ఈ స్థాయికి దిగజారతాడని మాత్రం ఊహించలేదు. వైసీపీ సభ్యుడిగా చెబుతున్నా.. పార్టీని సర్వనాశనం చేయడానికి ఇలాంటి పనికిమాలినవాడు ఒకడు అధ్యక్షుడుగా ఉంటే చాలనిపిస్తోంది. ఈ అరెస్ట్‌తో నా ప్రస్తుత పార్టీ పీడ విరగడ అవుతుంది. ఇక రాష్ట్రానికి మహర్దశ మొదలు కానుందని రఘురామరాజు అన్నారు.