శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (11:01 IST)

ప్రశాంతంగా సాగుతున్న రాజ్యసభ పోలింగ్ ... 33 మంది ఏకగ్రీవం

రాజ్యసభ ఎన్నికల పోలింగ్ దేశ వ్యాప్తంగా ప్రశాంతంగా సాగుతోంది. తెలంగాణ సహా మరో ఐదు రాష్ట్రాల్లో ఈ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 25 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా అందులో 10 ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచే ఉండటం గమనార్హ

రాజ్యసభ ఎన్నికల పోలింగ్ దేశ వ్యాప్తంగా ప్రశాంతంగా సాగుతోంది. తెలంగాణ సహా మరో ఐదు రాష్ట్రాల్లో ఈ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 25 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా అందులో 10 ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచే ఉండటం గమనార్హం. తెలంగాణ నుంచి 3, వెస్ట్ బెంగాల్ నుంచి 5, కర్ణాటక నుంచి 4, ఝార్ఖండ్‌ నుంచి 2, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఒకటి చొప్పున ఉన్నాయి. 
 
మొత్తం 58 మంది రాజ్యసభ అభ్యర్థుల పదవీకాలం ముగియనుండగా.. వాటిలో 10 రాష్ట్రాల నుంచి 33 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో కేంద్రమంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జావడేకర్‌ కూడా ఉన్నారు. మిగిలిన 25 స్థానాలకు నేడు పోలింగ్‌ కొనసాగుతోంది. 
 
వీరిలో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఉన్నారు. యూపీలోని 10 స్థానాల్లో 8 చోట్ల భాజపా సులువుగా గెలుస్తుండగా.. సమాజ్‌వాదీ, బహుజన్‌ సమాజ్‌వాదీ పొత్తు కారణంగా మరో సీటు గెలవడంపై అనుమానాలు నెలకొన్నాయి. 245 మంది రాజ్యసభ సభ్యుల్లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచే 31 మంది ఎంపీలు ఉంటారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకి ఎక్కువ రాజ్యసభ స్థానాలు వచ్చాయి. ప్రస్తుతం రాజ్యసభలో భాజపాకు 58 మంది ఎంపీలు ఉన్నారు.