శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (15:36 IST)

మోకాళ్ల పైన చింపుకుని శరీరాన్ని చూపుతూ సమాజానికి ఏం సందేశం ఇద్దామని? సీఎం ప్రశ్న

ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ యువత ఫ్యాషన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. పాశ్చాత్య పోకడలను పట్టుకుని యువత ప్రస్తుతం వేలాడుతోందన్నారు. మోకాళ్ల పైన చింపుకుని శరీరాన్ని చూపడం వల్ల లైంగిక వేధింపులు, డ్రగ్స్ వంటి పెడధోరణులకు బీజం వేస్తుందన్నారు. ఇలాంటి వస్త్ర ధారణ సుతారమూ మంచిది కాదని ఆయన అన్నారు. బాలల హక్కులపై జరిగిన వర్క్ షాపులో ఆయన ప్రసంగిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేసారు.
 
తమ పిల్లలు ఇలాంటి వస్త్రధారణ చేస్తున్న సమయంలో పెద్దలు వారిస్తే వారు ఆధునిక ప్రపంచంలోనూ రాణించగలరని అన్నారు. ప్రపంచం అంతా భారతదేశం యొక్క యోగాను అనుసరిస్తూ నిండుగా వస్త్రాలు ధరిస్తుంటే ఇక్కడి యువత ఇలా మోకాళ్లపై చింపుకుంటూ తిరగడం చెడు సంకేతాలను పంపుతుందన్నారు.