మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: మంగళవారం, 10 ఆగస్టు 2021 (11:12 IST)

ఆమె అజ్మీర్ జిల్లా కలెక్టర్‌, ఎత్తు 3 అడుగుల 2 అంగుళాలు

పోలీస్ ఎస్కార్ట్‌తో నడుస్తున్న ఆమెపేరు ఆరతి డోగ్రా, ఎత్తు 3 అడుగుల 2 అంగుళాలు. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చేసిన ఆమె, అనంతరం ఎంతో కృషి,పట్టుదలతో ఐఏఎస్‌లో ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తుంది.
 
మరుగుజ్జు అయినప్పటికీ ఆత్మన్యూనతకులోనై కుమిలిపోకుండా, అపారమైన  ఆత్మవిస్వాసంతో తన అంగవైకల్యాన్ని జయించి, కోట్లాదిమంది యువతలో పదుల సంఖ్యలో అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యపడే ఐఏఎస్ లో ఉత్తీర్ణురాలైoది.
 
బాహ్య సౌందర్యం లేకున్నా, సంకల్పబలంతో దేనినైనా సాధించవచ్చని నిరూపించి,ఎందరికో రోల్ మోడల్‌గా నిలిచారు ఆరతి డోగ్రా. హాట్స్ ఆఫ్....!