గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ivr
Last Modified: సోమవారం, 24 సెప్టెంబరు 2018 (14:07 IST)

చందమామలో సాయినాధుడు కనిపించాడు.... మీరు చూశారా?

చందమామలో సాయినాధుడు కనిపించాడు.... మీరు చూశారా? ఇదే ఇప్పుడు వాట్సప్ గ్రూపుల్లో చర్చ. నిన్న రాత్రి చంద్రుడిలో సాయి బాబా రూపం కనిపించిందంటూ వాట్స్‌యాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. కొందరైతే తాము చంద్రబింబాన్ని ఫోటో తీశామనీ, అందులో సాయినాధుడు ఇలా వున్నాడంట

చందమామలో సాయినాధుడు కనిపించాడు.... మీరు చూశారా? ఇదే ఇప్పుడు వాట్సప్ గ్రూపుల్లో చర్చ. నిన్న రాత్రి చంద్రుడిలో సాయి బాబా రూపం కనిపించిందంటూ వాట్స్‌యాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. కొందరైతే తాము చంద్రబింబాన్ని ఫోటో తీశామనీ, అందులో సాయినాధుడు ఇలా వున్నాడంటూ ఫోటోలను సైతం షేర్ చేశారు. 
 
ఇలా చంద్రుడిలో శిరిడి సాయిబాబా కనిపిస్తున్నారన్న వార్త వైరల్ అయ్యింది. ఇక సాయి భక్తులు చంద్రబింబంలో శిరిడీ సాయి కనిపించాడని గ్రూపుల్లో చెప్పేస్తున్నారు. చంద్రుడిలో సాయిబాబా అంటూ ఇప్పుడు చాలా ఫోటోలు షేర్ అవుతున్నాయి. ఐతే సైంటిస్టులు ఎప్పటిలానే... అది అంతా అవాస్తవమనీ, ఎవరి భావనను బట్టి ఆ ఆకృతులను మనసులో ఊహించుకోవడం వల్లనే ఇలా కనిపిస్తూ వుండవచ్చని అంటున్నారు. వాళ్ల వాదన ఎలా వున్నా చందమామలో సాయినాధుడుని చూసామని సాయి భక్తులు చెప్తున్నారు. మరి ఇవాళ పౌర్ణమి... సాయినాధుడు ఎలా కనిపిస్తారో?