గురువారం, 31 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (10:43 IST)

చెన్నైలో కరోనా వైరస్ కలకలం ... ఇద్దరి చైనీయుల్లో కరోనా లక్షణాలు..

చెన్నై మహానగరంలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఆదివారం ఉదయం మలేషియా, సింగపూర్ల నుంచి నుంచి చెన్నైకు వచ్చిన విమాన ప్రయాణికుల్లో ఇద్దరికి ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. వీరిలో ఒకరిని నగరంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేటెడ్ వార్డుకు తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ రోగి పేరు వల్లూజిన్. చైనా దేశస్థుడు. మలేషియా నుంచి చెన్నైకు రాగా, అతనిలో వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలింది. విమానాశ్రయంలో అతడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి వెంటనే రాజీవ్‌గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
అలాగే, సింగపూర్ నుంచి వచ్చిన మరో వ్యక్తిలోనూ ఇవే లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. చెన్నై విమానాశ్రయం ఒకే రోజు ఇద్దరి వ్యక్తుల్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించడంతో జనం వణుకుతున్నారు. కాగా, ఈ రెండు కేసులకు సంబంధించి అధికారిక సమాచారం అందాల్సివుంది.