శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జనవరి 2020 (12:34 IST)

కరోనా గురించి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పేశారా? కోటి మంది చనిపోతారా?

కరోనా గురించి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పేశారా? ప్రస్తుతం బ్రహ్మం గారు కరోనా జబ్బు గురించి చెప్పిన నాలుగు వ్యాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలియుగంలో జరిగే అనర్ధాల గురించి బ్రహ్మంగారు ఎప్పుడో కాలజ్ఞానంలో చెప్పివున్నారు.

కలియుగ పురుషుడు కాలాంతానికి చేసే ప్రళయాలు, వ్యాధులు, ఇబ్బందులను గురించి ఎప్పుడో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో పేర్కొని వున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనా వైరస్ గురించి బ్రహ్మంగారు చెప్పిన పద్యం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న వైరస్ ఇది. పాముల నుంచి ఈ వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్న వైద్య నిపుణులు.. దీన్ని తొలిసారిగా చైనాలో గుర్తించారు. దీని ప్రభావంతో ఆ దేశంలో ఇప్పటికే 132 మంది మృత్యువాతపడ్డారు. ఈ వైరస్ గురించి కాలజ్ఞానంలో 114వ పద్యం.. కోరంకి అనే జబ్బు గురించి ఉంది. అది భారత దేశానికి ఈశాన్య దిక్కున ఉన్న దేశంలో పుడుతుందని రాశారు.
 
అంటే.. భారత్‌కు ఈశాన్య దిక్కున ఉన్నది చైనాయే. కోరంకి జబ్జుతోకోటి మంది దాకా మృతిచెందుతారని తెలిపారు. ఆ కోరంకి.. కరోనా అయితే కోటి మంది దాకా మృతిచెందుతారట. దీంతో ఆ పద్యం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ పద్యం ఇదే..! 
 
ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను
లక్షలాది ప్రజలు సచ్చేరయ
కోరంకియను జబ్బుకోటిమందికి తగిలి
కోడిలాగ తూగిసచ్చేరయ ||శివ|| 114