మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (15:43 IST)

రాజకీయాల్లో పోటీ చేసేందుకు ఆక్స్‌ఫర్డ్ స్కాలర్‌షిప్ వద్దన్నారు.. ఎవరో?

2018లో రాజకీయాల్లో పోటీ చేసేందుకు మలేషియాకు చెందిన సయ్యద్‌ సాదిఖ్‌‌ తనకొచ్చే ఆక్స్‌ఫర్డ్ స్కాలర్‌‌షిప్‌ను సైతం తిరస్కరించారు. ఈ క్రమంలో దక్షిణాసియాలోనే అతి పిన్న వయస్కుడైన మంత్రిగా సాదిఖ్ ఎంపికయ్యారు.

2018లో రాజకీయాల్లో పోటీ చేసేందుకు మలేషియాకు చెందిన సయ్యద్‌ సాదిఖ్‌‌ తనకొచ్చే ఆక్స్‌ఫర్డ్ స్కాలర్‌‌షిప్‌ను సైతం తిరస్కరించారు. ఈ క్రమంలో దక్షిణాసియాలోనే అతి పిన్న వయస్కుడైన మంత్రిగా సాదిఖ్ ఎంపికయ్యారు. ఆయన వయసు 25 సంవత్సరాలే. ఇరవై ఐదేళ్లకే మలేషియాకు చెందిన సయ్యద్‌ సాదిఖ్‌‌ మంత్రిగా ఎంపికై చరిత్ర సృష్టించారు. 
 
మలేషియా ప్రధాని మహతీర్‌ మహ్మద్‌ జులై 2న తన మంత్రివర్గాన్ని విస్తరించారు. దేశానికి ప్రాతినిధ్యం వహించే ఈ మంత్రివర్గంలో ఆయన సాదిఖ్‌‌ అనే 25 ఏళ్ల కుర్రాడికి చోటిచ్చారు. సాదిఖ్‌‌ మలేషియా క్రీడలు, యువజన విభాగాలకు మంత్రిగా నియమితులయ్యారు. 
 
మలేషియా ప్రధాని మహతీర్‌ (ఆయన వయస్సు 93ఏళ్లు) ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడైన రాజకీయ నేత కాగా, సాధిక్ అతి పిన్న వయస్కుడైన రాజకీయ నేత. ఇద్దరికీ 68 ఏళ్ల వయోబేధం ఉన్నా.. సన్నిహితంగా వుంటారు. 
 
ఈ సందర్భంగా సాధిక్ మాట్లాడుతూ.. ప్రధాని మహతీర్ యువతకు సోమరితనమే పెద్ద శత్రువని చెప్తుంటారన్నారు. వారిని మంచి దారిలో నడిపించాలనేది ఆయన ఆకాంక్ష. స్మార్ట్‌ ఫోన్లలో ఆటలాడుకుంటూ వృధా చేసే సమయాన్ని పనికొచ్చే ఏ విషయంపై వెచ్చించినా యువత అద్భుతాలు చేయగలుగుతుందని సాధిక్ వ్యాఖ్యానించారు. 
 
ఇక సాదిఖ్ మంత్రిగా ఎంపికైన కొన్నాళ్లకే సాది‌ఖ్‌ తన పనితీరుతో యువతను అకట్టుకుంటున్నారు. యువత ఎదుర్కొనే సమస్యలపైనే దృష్టి సారించారు. వాటిని ‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలకోసం కృషి చేస్తున్నారు.
 
సామాజిక మాద్యమాల్లో ఈ యువ మంత్రి ‌ చాలా చురుకుగా ఉంటారు. సమకాలీన అంశాలపై ఆయన చేసే పోస్టులకు అభిమానులు ఎక్కువే. ఇన్‌స్టాగ్రామ్‌ లో ఈ యువమంత్రిని దాదాపు 12 లక్షలమందికి పైగా అనుసరిస్తున్నారు. సాధిఖ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.