మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 25 ఫిబ్రవరి 2021 (13:09 IST)

All Pass: 9, 10, 11 తరగతుల విద్యార్థులు ఆల్ పాస్: తమిళనాడు సీఎం ప్రకటన

2020-21 విద్యా సంవత్సరంలో 9, 10, 11వ తరగతి విద్యార్థులందరూ పరీక్షలో ఉత్తీర్ణులవుతారని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి 110వ నిబంధన ప్రకారం అసెంబ్లీలో ప్రకటించారు. 
 
అసాధారణ పరిస్థితి కారణంగా విద్యావేత్తలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభ్యర్థనల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
 
కరోనా వైరస్ విజృంభణ కారణంగా విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విద్యనభ్యసించారు. ఐతే గంటలపాటు మాస్కులు ధరించి పాఠశాలకు వస్తున్న సమయంలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన కేసులు నమోదయ్యాయి.
 
మరికొందరు చర్మ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇంకోవైపు తమ పిల్లల్ని బడికి పంపించేందుకు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేసారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి ఎడప్పాటి పళనస్వామి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.