బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 జులై 2024 (16:37 IST)

పవన్‌కు పూజ చేసిన మహిళ.. బొట్టు, పువ్వులు, కర్పూర హారతి (వీడియో)

Pawan kalyan
Pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటేనే పీకే ఫ్యాన్స్ ఊగిపోతారు. ప్రస్తుతం ఆయన కాస్త రాజకీయాల్లో రావడం, డిప్యూటీ సీఎం పదవిని అలంకరించడంతో పవన్ అభిమానుల్లో జోష్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం పవన్ కేవలం సినిమా హీరో కాదు.. సామాన్య ప్రజల నాయకుడు. పిఠాపురం ప్రజలే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్‌ను రాజకీయ నాయకుడిగా ఆరాధించే ప్రజల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. 
 
డిప్యూటీ సీఎం అయినా.. నిరాడంబరత పేద ప్రజలతో ఆయనకున్న ఆదరణతో ప్రజలు ఆయన లీడర్ షిప్ చూసి ఫిదా అవుతున్నారు. ఇందులో ముఖ్యంగా మహిళలే పవన్‌ను ఆదరించే ప్రజల్లో ముందున్నారు. ఇక చిన్నా పెద్దా తేడా లేకుండా ఆయనపై అభిమానం పెంచుకున్న వారు లేకపోలేదు. సరే ఈ విషయాన్ని పక్కనబెడితే పవన్‌కు సంబంధించిన బోలెడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
ఈ క్రమంలో పవన్‌కు ఓ మహిళ పూజ చేసే వీడియో ఎక్స్‌లో వైరల్ అవుతోంది. అదేంటంటే అచ్చం దేవతా పూజలా.. అసెంబ్లీలో పవన్ ప్రసంగిస్తున్న వీడియో టీవీలో రన్ అవుతుండగా.. ఓ మహిళ పవన్‌కు బొట్టు పెట్టి, పువ్వులు చల్లి కర్పూర హారతులు ఇస్తుంది. ఇంకా టీవీకి కింద పవన్ ఫోటోను సైతం వుంచి ఆమె పూజించడం చూసి పవన్ ఫ్యాన్స్, మద్దతుదారులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.