శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2023 (15:43 IST)

పుష్పవల్లితో వంగవీటి రాధాకృష్ణ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

Vangaveeti Radha
Vangaveeti Radha
విజయవాడ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ, నరసాపురం మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ జక్కం అమ్మని కుమార్తె జక్కం పుష్పవల్లితో నిశ్చితార్థానికి సిద్ధమయ్యారు. నిశ్చితార్థం ఆగస్ట్ చివరిలో జరగనుంది. సెప్టెంబర్ 6న వివాహం జరగనుంది.
 
2004 నుంచి 2009 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేసిన వంగవీటి రాధా కృష్ణ, 1988లో విషాదకరమైన ముగింపును చవిచూసిన దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమారుడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్పవల్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది.