శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2023 (16:49 IST)

అమెరికా వీధుల్లో ప్రియురాలితో ఆ క్రికెటర్ ముద్దూ ముచ్చట్లు

marcus stoins
ఓ అంతర్జాతీయ క్రికెటర్ అమెరికా వీధుల్లో తన ప్రియురాలితో కలిసి చక్కర్లు కొట్టారు. దీన్ని ఓ ఫోటోగ్రాఫర్ వీడియో, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియోతో పాటు ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఎవరో కాదు... ఆస్ట్రేలియా క్రికెటర్ మార్కస్ స్టోయినిస్. ఈయన తన ప్రియురాలితో కలిసి సెలవుల కోసం న్యూయార్క్ వెళ్లాడు. అక్కడే ఈ జంట కెమెరా కంటికి చిక్కింది.
 
డేవిడ్ గెరెరో అనే స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ వారిని ఆపి ఫోటో షూట్ కోసం అనుమతి తీసుకుని ఫోటోలు, వీడియో తీశారు. తొలుత మార్క్ ఫోటో షూట్ కోసం నిరాకరించినప్పటికీ ఆ తర్వాత అతను కూల్ అయి ఫోటోలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ఫోటోగ్రాఫర్‌కు తన ప్రియురాలితో కలిసి వివిధ భంగిమల్లో ఫోజులిచ్చాడు. ఈ  ఫోటోలను ఫోటోగ్రాఫర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో అవి వైర అయ్యాయి. ఈ ఫోటోలు మార్కస్ స్టోయినిస్ ‌తన ప్రియురాలితో చక్కర్లు కొడుతున్న విషయాన్ని బహిర్గతం చేయగా, ఫోటోగ్రాఫర్ మాత్రం ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. 
 
ఐటం రాజా అమరానికి 10 ప్రశ్నలు 
 
ఏపీ ఐటీ శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్‌కు జనసేన పార్టీ శతఘ్ని పది ప్రశ్నలను సంధించింది. ఐటమ్ రాజా గుడివాడ అమర్నాథ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత తరపున 10 ప్రశ్నలు. కాసేపు కోడిగుడ్లు పొదగటం ఆపేసి వీటికి సమాధానాలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం? అంటూ పది ప్రశ్నలతో ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. 
 
గత 4 ఏళ్లలో అనకాపల్లి ప్రాంతానికి తమరు చేసిన అభివృద్ధి ఏంటి? కనీసం రోడ్ల నిర్మాణం అయినా చేశావా? మంత్రిగా అయ్యాక ఉత్తరాంధ్రకు నువ్వు చేసిందేంటి? అనకాపల్లి తుమ్మపాల చెక్కెర కర్మాగారం తెరిపించలేని దద్దమ్మవి నువ్వు కాదా? సొంత నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలు పట్టించుకోని నీకు పరిశ్రమల శాఖ ఎందుకు దండగ?
 
రాజధాని అమరావతి అని ప్రతిపక్షంలో సమర్ధించిన మీ పార్టీ అధినేతను ఇప్పుడు ఎందుకు మార్చావు? అక్కడి రైతులకు అన్యాయం ఎందుకు చేస్తున్నావు? రేపు విశాఖ ప్రజలకు అన్యాయం జరగదని గ్యారెంటీ ఎవరు ఇస్తారు? అని ప్రశ్నించడం ఎందుకు చేతకాలేదు?
 
అధికారంలో ఉండి, పరిశ్రమల శాఖ మంత్రిగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడం కోసం గట్టిగా నిలదీయలేని సన్నాసివి నువ్వు కాదా అనే విషయాన్ని ప్రజలకు తెలియజేశావా లేదా? మేము కేంద్రమంత్రిని కలిసి విశాఖ ఉక్కుకు అండగా నిలబడ్డాం, మరి నువ్వేం చేశావ్ అమరం?
 
ఐటీ మంత్రిగా రాష్ట్రానికి నువ్వు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని? పెట్టుబడులు ఎన్ని? కల్పించిన ఉద్యోగాలు ఎన్ని? ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రిగా దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా అథమ స్థానంలో ఉన్న ఏకైక వ్యక్తి గుడివాడ అమర్నాథ్ అనే విషయంలో ఏమైనా సందేహం ఉందా? విశాఖ నుండి పరిశ్రమలు, లూలు మాల్, రాయలసీమ నుండి అమర్ రాజా, జాకీ లాంటి కంపెనీలు తరలిపోవాదనికి కారణం నీ లంచాల రాజకీయం?
 
నీ హయాంలో స్టార్టప్ ఇండియాలో కనీసం రాష్ట్రానికి స్థానం లేదు, అతితక్కువ స్టార్టప్ కంపెనీలు వచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని నిలబెట్టిన అసమర్థుడు నువ్వు కాదా? ఆఖరికి జార్ఖండ్ లాంటి రాష్ట్రాలతో కూడా పోటీపడలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లిన అసమర్థుడు నువ్వు? రాష్ట్రంలో ఎఫ్‌డీఐ పెట్టుబడులు ఎందుకు రావడం లేదు? ఎందుకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు? అసలు రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఉంది? ఆఖరికి నువ్వు కొడుగుడ్లు పొదగడంలో కూడా అభివృద్ధి లేదు. 
 
రాష్ట్రంలో ఉపాధి ఎందుకు కల్పించలేకపోతున్నావు? ప్రతీ సంవత్సరం లక్షల్లో ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి చేసుకుని బయటకు వస్తుంటే వారిలో కనీసం 10 శాతం మందికి కూడా ఉపాధి కల్పించలేని పరిస్థితిలో రాష్ట్రం ఎందుకు ఉంది?
 
ఉద్దానం అనే ప్రాంతం గురించి, సమస్య గురించి ఏ అధికారం లేని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బయటపెట్టకపోయి ఉంటే ఏ ఒక్కరైనా దానిపై మాట్లాడేవారా? హార్వర్డ్ నుండి శాస్త్రవేత్తలను రప్పించి అక్కడ మార్పుకు పునాది వేసింది జనసేన.
 
మొన్న అనకాపల్లి వాలంటీర్ పింఛన్ డబ్బుతో పరారయ్యాడు, అందులో నీ కమీషన్ ఎంత? వాలంటీర్లతో డేటా ఎందుకు కలెక్ట్ చేయిస్తున్నారు? వారి అధిపతి ఎవరు? ఇది రాజ్యాంగ విరుద్దమా కాదా? డేటా అడ్డుపెట్టుకుని జరిగే నేరాలకు బాధ్యత ఎవ్వరూ తీసుకుంటారు అనే దానికి సమాధానం చెప్పకుండా, వాలంటీర్లను అడ్డుపెట్టుకుని మీ తప్పులు కప్పిపుచ్చుకుంటున్న సన్నాసి ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం?
 
రాష్ట్రాన్ని సంక్షేమం పేరు చెప్పి అభివృద్ధి లేకుండా చేసి, అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసింది మీరు కాదా? విశాఖలో రాజధాని పేరిట భూకుంభకోణాలకు, రియల్ ఎస్టేట్ మాఫియకు అడ్డాగా మార్చింది ఎవరు? సొంత పార్టీ ఎంపీని చితకబాదింది ఎవరు? ఇదేనా అభివృద్ధి? విస్సన్నపేట భూముల్లో ఎంత భూమి దోచేశావ్ ఐటం రాజా?
 
చివరిగా రాష్ట్ర యువతకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల పాలిట దరిద్రం, అభివృద్ధి నిరోధకుడు గుడివాడ అమర్నాథ్ అని, మంత్రి వర్గంలో పనికిమాలిన వ్యక్తి నువ్వు అని ప్రజలు అంటున్నారు దీనికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి అంటూ వరుసగా ప్రశ్నలు సంధించింది.