సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 జూన్ 2021 (15:40 IST)

తల్లిదండ్రులపై కోపం.. ఆరేళ్ల పాటు సొరంగంలోనే.. బయట వేడిగా వున్నా.. లోపల మాత్రం..?

తల్లిదండ్రులు పిల్లల మేలు కోసం పాటుపడుతుంటారు. వారి కోసం నానా తంటాలు పడుతుంటారు. ఈ క్రమంలో పిల్లలు తప్పు చేస్తే మందలించడం చేస్తుంటారు. కొందరు చిన్నారులు తల్లిదండ్రులు మందలిస్తే తప్పును సరిదిద్దుకుంటారు. మరికొందరు తల్లిదండ్రులు మందలిస్తే భోజనం మానేయడమో…బయటకు వెళ్లి తిరగి రావడమో చేస్తుంటారు. 
 
అయితే..స్పెయిన్ కు చెందిన ఓ కుర్రాడు మాత్రం ఎవరూ చేయని పని చేశాడు. ఏకంగా సొరంగం తవ్వి..అందులోనే ఉండిపోయాడు. ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఆరేళ్ల పాటు..అదే పనిలో నిమగ్నమై.. భూగర్భంలోనే సొంత ఇంటి నిర్మించుకున్నాడు. ఇంట్లో అన్ని సదుపాయాలు కల్పించుకున్నాడు. పడుకోవడానికి బెడ్డూ.. వైఫై సౌకర్యం కల్పించుకున్నాడు.
 
స్పెయిన్‌లో అండ్రెన్ కాంబో నివాసం ఉంటున్నాడు. 2015 మార్చిలో తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. అప్పుడు అతని వయస్సు 14 సంవత్సరాలు. కోపంతో ఇంట్లో వెనకున్న పెరట్లో సొరంగం తవ్వుకున్నాడు. ఆరేళ్ల పాటు శ్రమించి..భారీ సొరంగం నిర్మించుకున్నాడు. 2018 వరకు తవ్వి మట్టిని బయటపడే వేసేవాడు.
 
అండ్రెన్ కు ఓ ఫ్రెండ్ సహకరించాడు. వారానికి 14 గంటల పాటు శ్రమించి సొరంగం తవ్వాడు. అండర్ గ్రౌండ్ ఇంటిని ట్విట్టర్ వేదికగా పోస్టు చేయడంతో తెగ వైరల్ అయిపోయింది. బయట ఎంత వేడిగా ఉన్నా.. లోపల మాత్రం చల్లగా ఉందని అండ్రెన్ వెల్లడిస్తున్నాడు.