బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 30 అక్టోబరు 2021 (15:50 IST)

ysr work from village: సీఎం జగన్ సరికొత్త ఆలోచన

కరోనా కారణంగా ప్రపంచంలో చాలామటుకు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పనిచేస్తున్నారు. ఈ నేపధ్యంలో అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న సమయంలో వర్క్ ఫ్రమ్ విలేజ్ కావాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.

 
ఇందుకుగాను ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలు అందేట్లు, అందుకుగాను అవసరమైన బ్యాండ్ విడ్తుతో కనెక్షన్లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే యువతు ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు అవసరమైన సౌకర్యాలను డిజిటల్ లైబ్రరీల ద్వారా అందేట్లు చూడాలన్నారు.

 
జనవరి నాటికి 4,530 డిజిటల్ లైబ్రరీలు సిద్ధమవుతాయనీ, రాష్ట్రంలో మొత్తం 12,979 పంచాయతీల్లో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.