ప్రధానమంత్రి భద్రతకు రూ.600 కోట్లు : నిర్మలా సీతారామన్
విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో దేశ ప్రధానమంత్రి భద్రతకు నిధుల ప్రవాహం పారింది. ఏకంగా రూ.600 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. ప్రస్తుతం ప్రధానమంత్రికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపులో 300 మంది పనిచేస్తున్నారు. వీరికోసం గత సంవత్సరం రూ.540 కోట్లు ఖర్చు చేశారు. అంతకుముందు యేడాదిలో ఈ మొత్తం రూ.420గా ఉంది.
అలాగే, గతంలో గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఉండేది. కానీ సోనియా, రాహుల్, ప్రియాంకలకు గత సంవత్సరం నవంబరు నుంచి ఎస్పీజీ భద్రత తొలగించారు. ఎస్పీజీ ప్రొటొకాల్‌ని గాంధీ కుటుంబం ఉల్లంఘించిన కారణంగా వారికి ఎస్పీజీ భద్రత తొలగించామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, దేవెగౌడ, వీపీ సింగ్‌లు ఎస్జీజీ భద్రత జాబితాలో ఉన్నారు.