శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By Selvi
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2016 (15:35 IST)

ప్రేమికుల రోజు ఖర్చు రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు.. రొమాంటిక్ డిన్నర్‌కే ఓటు

ప్రేమికుల రోజును అట్టహాసంగా జరుపుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు రెడీ అవుతున్నారు. మనదేశంలో ప్రేమికుల రోజున నిర్వహించుకోవద్దంటూ వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అయితే ప్రేమికులు మాత్రం వాలెంటైన్ డేను జరుపుకోవాల్సిందేననే నిర్ణయంలో ఉన్నారు. ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రేమికుల రోజును మించిన ముహూర్తం మరొకటి ఉండదంటున్నారు. 
 
అయితే ప్రేమికుల రోజును ఎలా నిర్వహించాలనే దానిపై నిర్వహించిన ఓటింగ్‌లో ప్రేమికులంతా రొమాంటిర్ డిన్నర్‌కే ఓటేశారు. ప్రేమికుల రోజు నిర్వహించేందుకు మనదేశంలో ప్రేమికులు మూడు నుంచి ఐదువేల రూపాయలు ఖర్చు చేసేందుకు రెడీగా ఉన్నట్లు ఓ సంస్థ సర్వే తేల్చింది.
 
ఇంకా ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో.. ఎక్కువ మంది ప్రేమికులు ఇలా రొమాంటిక్ డిన్నర్‌కే ఓటేస్తే.. ఇంకొంతమంది.. హెలికాప్టర్‌పై ప్రియురాలిని తీసుకెళ్లడం.. ఖరీదైన బహుమతులిచ్చి ప్రియురాళ్లను ఆశ్చర్యంలో ముంచెత్తడం బావుంటాయని చెప్పారు.