సంక్రాంతి స్పెషల్.. నోరూరించే పూతరేకులు ఎలా చేయాలంటే?

సెల్వి| Last Updated: బుధవారం, 8 జనవరి 2020 (19:39 IST)
సంక్రాంతికి పిండివంటలు చేస్తుంటారు. సంక్రాంతి పండుగ రోజున చేసే ఫలహారాలను ఇరుగుపొరుగు వారికి బంధువులకు, స్నేహితులకు పంచిపెడుతుంటాం. అలాంటి ఫలహారాల్లో పూతరేకులు కూడా ఒకటి. సంక్రాంతి రోజున పూత రేకులను ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావలసిన పదార్థాలు
స‌గ్గుబియ్యం- కేజీ
పంచదార-
ఒక కేజీ
జీడిప‌ప్పు - అర కేజీ
యాల‌కులు -
50 గ్రాములు
నెయ్యి- పావు కేజీ

తయారీ విధానం.. ముందుగా స‌గ్గుబియ్యాన్ని ఉడికించి చిక్క‌టి గంజిలా సిద్ధం చేసుకోవాలి. పూత రేకుల తయారీ కోసం అమ్మే కుండ‌ను మంట మీద బోర్లించి వేడెక్కిన త‌ర్వాత, తెల్ల‌ని శుభ్ర‌మైన వస్త్రాన్ని స‌గ్గుబియ్యం గంజిలో ముంచి కుండలో ప‌రిచి వెంట‌నే వస్త్రాన్ని వెంటనే తీసేయాలి.

అలా వస్త్రానికి అంటిన అంటిన గంజి కుండ వేడికి ప‌లుచ‌ని రేకులా వ‌స్తుంది. ఆ రేకును కుండ నుంచి తీయాలి. పూతరేకులు మ‌ధ్య‌లోకి విరిగిపోకుండా అట్ల‌కాడ‌తో జాగ్ర‌త్త‌గా తీయాలి.

ఒక‌ రేకు తీసుకుని నెయ్యి రాసి జీడిప‌ప్పు మిశ్ర‌మం ఒక స్పూను వేసి ప‌లుచ‌గా ప‌రిచి పైన మ‌రొక రేకును ప‌రిచి మ‌డ‌త వేయాలి. ఇలా గంజి మొత్తాన్ని ఇలాగే రేకులుగా చేసుకుంటే పూతరేకులు సిద్ధమైనట్లే. పూత రేకుల కోసం వాడే వస్త్రం త‌ప్ప‌ని స‌రిగా కాట‌న్‌దే అయి ఉండాలి.దీనిపై మరింత చదవండి :