మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Modified: గురువారం, 18 సెప్టెంబరు 2014 (15:45 IST)

మృదువైన జుట్టుకోసం పొటాటో ప్యాక్ ట్రై చేయండి...!

బంగాళాదుంప ఆరోగ్యానికే కాదు.. జుట్టు సౌందర్యానికి మేలు చేస్తుంది. అందుకే బంగాళదుంపతో ప్యాక్ ఎలా చేయాలో చూద్దాం.. ఒక బంగాళదుంపను కోరి నీటిని పిండేయాలి. దానిలో గుడ్డు, పెరుగు కలపాలి. అప్పుడు మంచి ప్యాక్ తయారవుతుంది. 
 
ఈ పేస్ట్‌ను జుట్టు మొత్తం జుట్టు మూలాలకు పట్టించండి. 20 నిముషాల తర్వాత వెచ్చని నీటితో మరియు సాధారణ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. మంచి పలితం కోసం 20 రోజులకు ఒకసారి ఈ విధంగా చేయాలి. ఈ ప్యాక్ ఆరోగ్యకరమైన మరియు మెరిసే జుట్టును ఇస్తుంది.
 
అలాగే తొక్క తీసేసిన పొటాటోను తరిగి వేడైన నీటిలో 20 నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని వడగట్టి పెట్టుకోవాలి. జుట్టును సాధారణ షాంపూతో శుభ్రం చేసుకున్నాక పైన మరిగించి వడకట్టిన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మీ జుట్టుకు సహజ నలుపు రంగు ఇవ్వటానికి సహాయపడుతుంది. ఈ విధంగా వారం విడిచి వారం చేయాలి. ఇది బూడిద రంగు జుట్టు కోసం మంచి సహజమైన చికిత్సగా ఉంటుంది.
 
అలాగే హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేసేందుకు మూడు స్పూన్ల బంగాళదుంప రసం, మూడు స్పూన్ల కలబంద రసం, రెండు స్పూన్స్ తేనే తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి రెండు గంటల తర్వాత రెగ్యులర్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఒక వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.