మహిళలు ముక్కుపుడక కుట్టించుకుంటే ఇన్ని ప్రయోజనాలా?
మహిళలు ధరించే ఆభరణాల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఒక్కో ఆభరణం వెనుక ఒక్కో ప్రయోజనం దాగి వుంటుంది. అలాగే ముక్కుపుడక వెనుక కూడా సైంటిఫిక్ ప్రయోజనాలున్నాయి.
ముఖ్యంగా మహిళల పునరుత్పత్తి అవయవాలతో సంబంధం కలిగి ఉన్న ఎడమ ముక్కు భాగంలోని నరాలను శాంతపరచే క్రమంలో భాగంగా మహిళలు ముక్కు పుడకలను ధరిస్తారని చెప్పబడింది. అలాంటి ఈ ధారణ మహిళ ప్రసవ సమయంలో ఎంతో మేలు చేకూర్చుతుందట. అంతేకాదు, మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే బహిష్టు నొప్పిని కూడా ఇది నిరోధిస్తుందట.
పూర్వ విశ్వాసాల ప్రకారం భార్య తన ముక్కు ద్వారా వదిలే శ్వాస భర్త ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందట. అందువల్ల మహిళ ముక్కుపుడకను ధరిస్తే ఆ గాలి స్వచ్చంగా మారి ఎటువంటి చెడు అనారోగ్య ప్రభావాలను కలిగించదట. ముక్కుపుడక బంగారంతో చేస్తారు కనుక ఆ లోహానికి అలాంటి గుణం వున్నదట.