మందార నూనెలో పసుపు కలిపి ఇలా చేస్తే..?

hibiscus
Last Updated: బుధవారం, 24 ఏప్రియల్ 2019 (15:41 IST)
ఇప్పటి కాలుష్యం వాతావరణం కారణంగా ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. చాలామందైతే జుట్టు రాలే సమస్యలను ఎదుర్కుంటున్నారు. అలాంటివారు.. కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది..

కాలుష్యం, ఆరోగ్య సమస్యలు ఏ కారణాలైనా సరే ముందుగా ఆ ఎఫెక్ట్ జుట్టుపైనే కనబడుతుంది. ఈ మధ్యకాలంలో జుట్టు రాలడం చాలా కామన్‌గా మారిపోయింది. దీంతో ఆ సమస్య గురించి ఎక్కువగా ఆందోళన చెందడం వలన మరీ తీవ్రమవుతోంది. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు చాలామంది డాక్టర్స్, బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే జుట్టు రాలే సమస్య తగ్గడం లేదని బాధ. మరి అందుకు ఏం చేయాలో చూద్దాం..

మందార పువ్వులు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. కేవలం పువ్వులే కాదు.. వీటి ఆకులు కూడా జుట్టు సమస్యలను తొలగిస్తాయి. మందారపువ్వులను కొబ్బరినూనెలో కలిపి బాగా వేడిచేసుకోవాలి. ఈ నూనెను తలకు అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తుండడం వలన జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాదు, వెంట్రుకలు త్వరా తెల్లబడవు కూడా.

చర్మంలోని మృతకణాలను తొలగించడం ఈ నూనె ప్రత్యేకం. పువ్వులు దొరకనప్పుడు వాటి ఆకులతో కూడా ఈ నూనెను తయారుచేసుకోవచ్చును. కాళ్లు పగుళ్ళతో బాధపడేవారు.. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా కాళ్లని శుభ్రంగా కడుక్కని మందార నూనెలో కొద్దిగా పసుపు వేసి రాసుకోవడం వలన ఈ సమస్య కూడా తగ్గిపోతుంది.దీనిపై మరింత చదవండి :